ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో మూడు రాజధానులపై ఆమె సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని వ్యంగ్యాస్తా్లు సంధించారు. అవి ఏంటంటే ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు.
తన ఐదేళ్ల పాలనలో జగన్(YS Jagan) ఏర్పాటు చేసింది ఈ మూడింటినే అని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారని ప్రశ్నించారు. వాళ్లు ఏ హక్కుతో గాంధీ భవన్‌కు వచ్చి తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అలా చేస్తే తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. రైతులను కారుతో తొక్కించిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కొడుక్కి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని విమర్శించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణని పట్టుకోవాలని ఆమె(Renuka Chowdhury) సవాల్ విసిరారు.