వేసవి సెలవులు కావడంతో తిరుమలకు(Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు 20గంటలకు పైగా సమయం పట్టింది. అయితే ఇవాళ ఒక్కసారిగా భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. మొన్నటివరకు అన్ని కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు ప్రస్తుతం కేవలం నాలుగు కంపార్ట్ మెంట్లలోనే ఉన్నారు. స్వామి దర్శనానికి కూడా 6గంటల సమయం మాత్రమే పడుతుంది. సెలవులు ముగింపునకు రావడంతోనే భక్తులు తాకిడి తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం 84,539 మంది భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకోగా.. 39,812 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.72కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -
Read Also: ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter