TDP Bus Tour | టీడీపీ బస్సుయాత్రలో తీవ్ర విషాదం

-

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర(TDP Bus Tour)లో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిడుగు రాళ్ల మండలంలో బుధవారం ఈ బస్సు యాత్ర జరిగింది. అయితే, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ భోజనాల సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వేడి కుర్మా డేక్షలో యారగని కోటేశ్వరరావు (55) అనే టీడీపీ కార్యకర్త పడిపోయాడు. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావును వెంటనే పిడుగురాళ్ల ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించారు. కోటేశ్వరరావు శరీరం 70% కాలిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోటేశ్వరావుని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు.

- Advertisement -
Read Also:
1. అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...