Sajjala Ramakrishna Reddy: హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వటం సంతోషకరం

-

Sajjala Ramakrishna Reddy comments on supreme courts impose saty on Highcourt vedict: మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సజ్జల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వటం సంతోషకరంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీం కోర్టు స్టే ఇవ్వటం.. తమ విధానాలను తప్పుబట్టే వారికి మెుట్టికాయ లాంటిదని అన్నారు. త్వరలోనే న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉన్న చిన్నచిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలలో తప్పొప్పులను నిర్ణయించాల్సింది ప్రజలేనని.. ఈ అంశంపై ప్రజా కోర్టులోనే ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సహజ న్యాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలన్నారు. అటువంటప్పుడు మిగిలిన వ్యవస్థలు జోక్యం చేసుకోరాదని సజ్జల వ్యాఖ్యానించారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టలేమని.. చంద్రబాబు పరిస్థితిని చూస్తే అర్థం అవుతుందన్నారు. జగన్‌ మూడు రాజధానుల చట్టం చేసిన తరువాత రాష్ట్రంలో వచ్చిన అన్ని ఎన్నికల్లో జనం మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని పవన్‌ కోరుకుంటున్నారనీ.. ఆయన కోరిక తీరదని సజ్జల (Sajjala Ramakrishna Reddy) ఎద్దేవా చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...