Jaggareddy: రాజకీయ పార్టీలో కుర్చీ అడగటం.. ట్రై చేయటం సహజం

-

Jaggareddy sensational comments on TPCC post: నేను మెుదటి నుంచి పీసీసీ కావాలని అడుగుతున్నా.. పీసీసీ పదవి ఇచ్చే వరకు అడుగుతానే ఉంటా.. రాజకీయ పార్టీలో కుర్చీ అడగటం, ట్రై చేయటం సహజం. అందులో తప్పేముందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు ఉన్నది ఉన్నట్లే మాట్లాడటం వచ్చునని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి సహజం.. అన్ని పార్టీల్లోనూ అసమ్మతి ఉంటుందని అన్నారు. అసమ్మతిని కొందరు మూర్ఖులు కోవర్టులుగా మార్చేశారని దుయ్యబట్టారు. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఇంటి పెద్దమనిషిలా వ్యవహరించాలని 24 గంటలు సర్వీస్‌ ఇవ్వాల్సిందేనని సూచించారు. కాంగ్రెస్‌ అందరి జాగీరు.. జగ్గారెడ్డిదో, రేవంత్‌దో కాదు అని అన్నారు. రేవంత్‌ని దించి.. కుర్చీ ఎక్కాలని ఎవడకీ లేదని అన్నారు. పీసీసీ పోస్టులో ఎవరున్నా లాభనష్టాలు పీసీసీ వహించాలన్నారు. పీసీసీగా రేవంత్‌ సమిష్టి నిర్ణయాలు తీసుకోవటం లేదనీ.. రేవంత్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటంపై జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ని పీసీసీగా ఎన్నికల వరకు కొనసాగించాలన్నదే తన కోరిక అని జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...