YS Sharmila | వైయస్ షర్మిలకు భద్రత పెంచిన పోలీసులు

-

తనకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) చేసిన విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ఆమెకు భద్రతను పెంచామని పేర్కొన్నారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే భద్రత కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

- Advertisement -

కాగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. “నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేమీ పట్టనట్లు, ఒక మహిళ అని కూడా చూడకుండా, ఓ పార్టీకి అధ్యక్షురాలిని అని కూడా పట్టించుకోకుండా.. ఇవాళ మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే.. మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ఇది ప్రజాస్వామ్యం అన్న ఆలోచన ఉందా? గుర్తుందా?” అని ప్రశ్నించారు.

“మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే.. మా చెడు కోరుకుంటున్నారు అనే కదా దాని అర్థం. మాకు ఏదైనా ప్రమాదం జరగాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కలిపించే వాళ్లలో కూడా మీ వాళ్లు ఉంటారనే కదా అర్థం. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?” అంటూ ఆమె(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also:  ఏపీలో తెలుగుదేశం పార్టీదే విజయం.. ప్రముఖ మీడియా సర్వేలో స్పష్టం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబు ఆరోగ్యం బాగాలేదు.. వైద్యులు

మోహన్ బాబు(Mohan Babu) ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం...

Manchu Vishnu | ‘వారు దూరంగా ఉండాలి’.. విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్

మంచు ఫ్యామిలీ విషయంపై మంచు విష్ణు(Manchu Vishnu) స్పందించారు. ప్రతి కుటుంబంలో...