ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చారు టిడిపి శ్రేణులు. వైసీపీ కక్షపూరితంగా ఆయనపై కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవినీతి మరకలేని ఆయనపై బురద జల్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. సిఐడి అధికారులు కూడా జగన్ చెప్పినట్టు నడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉంచితే చంద్రబాబుకు ప్రాణహాని ఉంటుందని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Sidharth Luthra) సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా(Sidharth Luthra) విజయవాడ ఏసీబీ కోర్టులో మరోసారి హౌస్ అరెస్ట్ పిటిషన్ వేయనున్నారు. NSG క్యాటగిరి సెక్యూరిటీ కలిగి, వీవీఐపీ గా ఉన్న చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, జైల్లో ఉంచడం సేఫ్ కాదని, హౌస్ అరెస్టుపై తమ వాదనలు వినిపిస్తామని లూథ్రా మీడియాకి తెలిపారు. గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ కేఎమ్ జోసెఫ్ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ.. ఏసీబీ కోర్టులో హౌస్ అరెస్ట్ కు సంబంధించిన పిటీషన్లను వేయనున్నారు చంద్రబాబు(Chandrababu) తరఫు న్యాయవాదులు. అత్యంత భద్రత కలిగిన వ్యక్తులకు హౌస్ అరెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని లూథ్రా(Sidharth Luthra) టీమ్. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఐదుగురు మంత్రులకు సంబంధించిన 70 పేజీల తీర్పు కాపీని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి అందించనున్నారు.