కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నర్సింహా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఈ నెల 25వ తేదీన విచారణ చేపట్టి తగిన ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే అప్పటివరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. సుప్రీం ఆదేశాలతో ఎల్లుండి లోపు అవినాశ్ రెడ్డి(Avinash Reddy)ని అరెస్టు చేస్తారో? లేక హైకోర్టు తీర్పు వరకు వేచిచూస్తారో? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: భారీగా ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టిన జియో మార్ట్
Follow us on: Google News, Koo, Twitter