విశాఖపట్నం జిల్లా సింహాచలం(Simhachalam) అప్పనస్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి చందనోత్సవం కావడంతో దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. తెల్లవారుజామున నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గందరగోళం నెలకొంది. అధికారులు ప్రముఖలకు దర్శనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గంటల కొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో దర్శనానికి వచ్చిన మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణలకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారుల తీరుపై మంత్రులు మండిపడ్డారు. మరోవైపు స్వామివారి దర్శనానికి వచ్చిన విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి(Swaroopanandendra saraswati) కూడా అధికారులపై ఫైర్ అయ్యారు. తన జీవితంలో భక్తులు ఇలా ఇబ్బందులు పడడం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సింహాచలం(Simhachalam) ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Read Also: లక్ష్మీ కటాక్షం కోసం పౌర్ణమి రోజు ఇలా చేయండి
Follow us on: Google News, Koo, Twitter