యూజర్లకు ఆగ్రహం తెప్పించిన స్విగ్గీ కొత్త ఆప్షన్

-

స్విగ్గీ(Swiggy).. తెలియని వారుండరు. ఇవాళ రేపు ఏం తినాలని అనిపించినా.. బయటకు వెళ్లడానికి ఓపిక లేకనో.. బద్దకమేసో కానీ దాదాపుగా అందరూ స్విగ్గీ లాంటి యాప్స్‌లోనే ఫుడ్ ఆర్డర్స్ పెడుతున్నారు. ఇలాంటి యాప్స్‌ విషయంలో ఇండియాలో బాగా పేరు తెచ్చుకున్న యాప్‌లలో స్విగ్గీ టాప్‌లో ఉంది. అయితే తాజాగా ఈ యాప్ కాస్తా చాలా వింతగా ప్రవర్తిస్తోంది. ఫుడ్ ఆర్డర్ పెడుతున్న కస్టమర్లకు ఆర్డర్ బుక్ అయిన మెసేజ్ కాకుండా వేరే మెసేజ్‌ను డిస్‌ప్లే చేస్తోంది. దీనిని చూసిన ఆహార ప్రియులు ఏం చేయాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవటానికి ట్రై చేసిన యూజర్లకు ఓ సమస్య ఎదురైంది. ఫుడ్ డెలివరీ పేజీ కి వెళ్లి ఏదైనా రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎలాంటి ఐటమ్స్ అందుబాటులో లేవు అని ఒక మెసేజ్ కనిపిస్తోంది. దానికింద గ్రూప్ ఆర్డర్ ఆప్షన్ కనిపిస్తోంది. టీమ్ అప్ అయ్యి ఆర్డర్ చేయండి. కలిసి డిషెస్ ని కార్ట్ లో యాడ్ చేయండి అని చూపిస్తోంది. వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్ కొరతతో స్విగ్గీ ఈ ఆప్షన్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. స్విగ్గీ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించని యూజర్లు ముందు ఆశ్చర్యపోతున్నా కొద్దిసేపటికి స్విగ్గీ చిందులేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న ఈ వింత అనుభవాన్ని ఎక్స్(ట్విట్టర్) వేదికగా భయంకరమైన తిట్లతో ఆశీర్వదిస్తున్నారు.

- Advertisement -

చేతకాకపోతే వన్ మెంబర్ షిప్ తీసుకోండి… మంచి డెలివరీ సర్వీసులిస్తాం, ఫ్రీ డెలివరీలు చేస్తామని కాకమ్మ కబుర్లు ఎందుకు చెప్పావని ట్వీట్లతో బూతులు తిడుతున్నారు. కస్టర్మ రెస్పాన్స్‌తో తేరుకున్న స్విగ్గీ(Swiggy).. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉందని భావించింది. అందుకే ఎక్స్ లో అలర్ట్ అయి.. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఏదైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడుకుందాం. దయచేసి డైరెక్ట్ మెసేజ్ చేయండి’ అంటూ కాళ్లబేరానికి రావడం మొదలు పెట్టింది. కానీ కస్టమర్లు మాత్రం ‘తగ్గేదే లే.. తాడో పేడో ఇక్కడే తేల్చుకుందాం’ అని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also: 2,100 మందితో బురద తొలగింపు: చంద్రబాబు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...