BJP – TDP | బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు.. అధికారిక ప్రకటన విడుదల..

-

కొంతకాలంగా వేచి చూస్తున్న ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు టీడీపీ, జనసేన ముందుకు వచ్చాయని ఈ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కృషి చేస్తాయన్నారు.

- Advertisement -

గతంలోనూ టీడీపీ, బీజేపీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరిందని గుర్తుచేసుకున్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో టీడీపీ భాగమైందన్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయని.. జనసేన పార్టీ మద్దతు తెలిపిందన్నారు. అలాగే ప్రస్తుత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని ఒకట్రెండు రోజుల్లో సీట్ల అంశంపై స్పష్టత వస్తుందని స్పష్టంచేశారు.

టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ జేపీ నడ్డా కూడా ట్వీట్ చేశారు. ఎన్డీయే కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. విజనరీ ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన ముందుకెళ్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూడు పార్టీలు చిత్తశుద్ధితో పనిచేస్తాయని నడ్డా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...