తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case)పై టీడీపీ అధినేత చంద్రబాబు(ChandraBabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పోలీసులకు వివేకా కేసు ఓ కేస్ స్టడీ వంటిదని తెలిపారు. వివేకా హత్య కేసు నిందితులు చివరికి సీబీఐ అధికారులను కూడా బెదిరించారని పేర్కొన్నారు. వివేకాను గొడ్డలితో నరికి చంపి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తన తండ్రికి న్యాయం జరగాలని వివేకా కుమార్తె సునీత(Sunitha) ధైర్యంగా పోరాడుతున్నారని అభినందించారు. ప్రజాకోర్టులో వివేకా హత్య కేసును పెడుతున్నామన్నారు. జగన్(YS Jagan) పాలనలో రౌడీలు రెచ్చిపోతున్నారని.. వారి తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. మీకు అడ్డువచ్చిన వారందరినీ చంపేసి హత్య రాజకీయాలు చేస్తారా? అని మండిపడ్డారు. కడప జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ జోన్-5 సమావేశంలో చంద్రబాబు(Chandrababu) పాల్గొన్నారు.
Read Also: జగన్ ఇలాఖాలో చంద్రబాబుకు జలక్
Follow us on: Google News, Koo, Twitter