Raa Kadali Ra | ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 5 నుంచి 29 వరకూ మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనుంది. ప్రతి రోజూ రెండు సభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ‘రా.. కదలిరా(Raa Kadali Ra)’ అనే పేరు పెట్టారు.
చంద్రబాబు జిల్లాల వారి షెడ్యూల్ ఇదే..
జనవరి 5 – కనిగిరి (ఒంగోలు పార్లమెంట్)
జనవరి 6 – తిరువూరు (విజయవాడ పార్లమెంట్), ఆచంట (నరసాపురం పార్లమెంట్)
జవవరి 9 – వెంకటగిరి (తిరుపతి పార్లమెంట్), ఆళ్లగడ్డ (నంద్యాల పార్లమెంట్)
జనవరి 10 – బొబ్బిలి (విజయనగరం పార్లమెంట్), తుని (కాకినాడ పార్లమెంట్)
జనవరి 18 – గుడివాడ (మచిలీపట్నం పార్లమెంట్)
జనవరి 19 – గంగాధర నెల్లూరు (చిత్తూరు పార్లమెంట్), కమలాపురం (కడప పార్లమెంట్)
జనవరి 20 – అరకు (అరకు పార్లమెంట్), మండపేట (అమలాపురం పార్లమెంట్)
జనవరి 24 – పీలేరు (రాజంపేట పార్లమెంట్ ), ఉరవకొండ (అనంతపురం పార్లమెంట్)
జనవరి 25 – కోవూరు (నెల్లూరు పార్లమెంట్), పత్తికొండ(కర్నూలు పార్లమెంట్)
జనవరి 27 – గోపాలపురం (రాజమండ్రి పార్లమెంట్), పొన్నూరు(గుంటూరు పార్లమెంట్)
జనవరి 28 – మాడుగుల (అనకాపల్లి పార్లమెంట్), టెక్కలి (శ్రీకాకుళం పార్లమెంట్)
జనవరి 29 – ఉంగుటూరు (ఏలూరు పార్లమెంట్), చీరాల(బాపట్ల పార్లమెంట్)