అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి.. చంద్రబాబు కీలక నిర్ణయం

-

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి ఘటన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని ప్రకటించారు. ఈ నెల 25 తేదీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటనలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు పర్యటనలు చేస్తామని, వైసీపీ దుర్మార్గాలపై ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇదే అంశాలపై ఢిల్లీకి కూడా వెళతామని అన్నారు. ఆగస్టు సంక్షోభంలోనూ.. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ.. సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని, ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఘటన చరిత్రలో చీకటి రోజని మండిపడ్డారు. పెద్ద మనిషి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీదకు వస్తారా..?.. స్వామి మీద చేయి వేయకుండా- చూసుకోలేకపోయాననే బాధ నాకెప్పుడూ ఉంటుందని, వైసీపీని వదిలిపెట్టేదే లేదని చంద్రబాబు(Chandrababu) హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -
Read Also: రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...