జగన్‌ తప్పులు చేస్తుంటే.. చూస్తూ కూర్చోవాలా?

-

రాష్ట్రాన్ని దుర్మార్గులు పాలించటంతో.. దాడులు పెరిగాయని టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. వైసీపీ నేతల దాడిలో కంటి చూపును కోల్పోయిన టీడీపీ నేత చెన్నుపాటి గాంధీని మాజీ మంత్రులు అయ్యన్న పాత్రడు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్‌ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ కోసం ఎంతో అంకిత భావంతో పని చేసిన చెన్నుపాటి గాంధీపై దాడి చేయటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోమని చెప్తే.. దాడులు చేస్తారా అని వైసీపీ నేతలు ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్‌ తప్పులు చేస్తుంటే.. చూస్తూ కూర్చోవాలా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు 2019లో ఒక పిచ్చోడికి ఓట్లు వేశారంటూ వ్యాఖ్యానించారు. నాపై 14 కేసులు పెట్టారు.. ఇప్పుడు నా కుమారుడుపై పడ్డారు. న్యాయస్థానాలు లేకపోయి ఉంటే ఈ పాటికి మమ్మల్ని లేపేసేవాళ్లు అని అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ టైమ్‌ ఇంక అయిపోయిందనీ.. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...