Btech Ravi | రోజుకో ట్విస్ట్.. బ్రదర్ అనిల్‌తో టీడీపీ నేత బీటెక్ రవి భేటీ..

-

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల భర్త అనిల్‌(Brother Anil)ను టీడీపీ నేత బీటెక్‌ రవి(Btech Ravi) కలిశారు. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి షర్మిల ఫ్యామిలీ ఇండిగో విమానంలో బయలుదేరారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో అనిల్‌తో రవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

పులివెందులలో సీఎం జగన్‌పై బీటెక్ రవి(Btech Ravi) పోటీ చేస్తున్నారు. మరోవైపు షర్మిల కాంగ్రెస్‌లో చేరి కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రదర్‌ అనిల్‌ను రవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కడప ఎంపీగా పోటీ చేస్తే షర్మిలకు టీడీపీ క్యాడర్ సహకారం అందిస్తుందని.. అలాగే పులివెందులలో బీటెక్ రవికి షర్మిల కుటుంబం మద్దతు తెలపాలనే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి షర్మిల రాకతో రాష్ట్ర రాజకీయాలతో పాటు కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Read Also: బాపట్ల TDP టికెట్ రేసులో సీనియర్ నేత.. వేగేశనకి షాక్ తప్పదా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...