Tdp leader chintakayala Ayyanna patrudu Arrest మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడని, ఆయన కొడుకు రాజేష్ అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉన్నాట్లు సమాచారం. అయితే.. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై ఆరోపణలు ఉండటంతో.. తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, నోటీసులు ఇచ్చి అయ్యన్నను ఆయన కుమారుడు రాజేష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడుపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
- Advertisement -