tdp leader Devineni Uma fires on ycp Govt: పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యంపై.. మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటున్న జగన్ రెడ్డి.. రైతు ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. 71 శాతానికి పైగా పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 42 నెలలుగా పోలవరాన్ని పడుకోబెట్టారని దుయ్యబట్టారు. జరుగుతున్న పనులను కమీషన్ల కక్కుర్తితో వైసీపీ ఆపేసిందని ధ్వజమెత్తారు. నిపుణులు హెచ్చరిస్తున్నా.. తప్పిదాలు చేస్తున్నారంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
Devineni Uma: కమీషన్ల కక్కుర్తితో పోలవరం ఆపేశారు
-