టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపరాఫర్!

-

Jayamangalam Venkata Ramana: ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పొత్తులపై పలు పార్టీల నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తూ రాజకీయ వేడి పెంచగా.. ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సీఎం జగన్ తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఈ క్రమంలో ఓ సంచలన వార్త టీడీపీ నేతలను షాక్‌కు గురిచేసింది. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ టీడీపీ(TDP) షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందుకే జయమంగళం(Jayamangalam Venkata Ramana) వైసీపీలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ హామీతోనే సీఎం జగన్ సమక్షంలో జయమంగళం వెంకటరమణ వైసీపీ(YCP) కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయనకు నలుగురు గన్‌మెన్లతో ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...