కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్న నటి శ్రీరెడ్డి(Sri Reddy). ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దుతగా వీడియోలు పెట్టి ఆమె బాగా ఫేమస్ అయిపోయారు. శనివారం ఆమెపై కర్నూలు మూడో టౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రులు లోకేష్, అనిత గురించి ఇస్టారాజ్యంగా మాట్లాడుతూ, తీవ్ర పదజాలంతో వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
అయితే ఎన్నికల ముందు వైసీపీ కార్యకర్తగా టీడీపీ, జనసేన నేతల తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి. అదే విధంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అనుచిత వ్యాఖ్యాలు చేశారు. కొన్ని రోజుల తర్వాత జగన్‌ను ప్రశ్నించడం కూడా ప్రారంభించారు శ్రీరెడ్డి. వైసీపీనే ప్రాణం అనుకుని పనిచేసిన తనలాంటి కార్యకర్తలను ఎలా వదిలేస్తారని, ఇప్పుడు తమపై టీడీపీ, జనసేన వాళ్లు దాడులు చేస్తే ఎవరు అండగా ఉంటారంటూ ప్రశ్నించారు శ్రీరెడ్డి(Sri Reddy).