AP Assembly | ఏపీ అసెంబ్లీలో రచ్చ.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

-

రెండో రోజు ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ సభ్యులను సభాపతి తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలపై టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ పోడియంను చుట్టుముట్టారు. గవర్నర్ ప్రసంగం పేపర్లు చింపి పోడియంపై విసిరేస్తూ ఆందోళన చేపట్టారు. బాదుడే బాదుడు, సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- Advertisement -

అయితే టీడీపీ సభ్యుల తీరును మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తీవ్రంగా ఖండించారు. తమను అనవసరంగా రెచ్చొగొట్టే పనులు చేయవద్దని మండిపడ్డారు. మీకు ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా బయటికి వెళ్లండి.. లేదా మార్షల్ వచ్చి బయటకు నెట్టేస్తారని హెచ్చరించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే 15 నిమిషాల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

AP Assembly | అయినా కానీ బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపించేశారు. సస్పెండైన ఎమ్మెల్యేల్లో కింజారపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్‌రావు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గణబాబు, వీరాంజనేయస్వామిలు ఉన్నారు.

Read Also: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...