తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్(YVB Rajendra Prasad) తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని.. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫోన్‌లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. వైద్యులతోనూ మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎటువంటి ప్రాణహాని లేదని చంద్రబాబుకు వైద్యులు వివరించారు. మరోవైపు రాజేంద్రప్రసాద్(YVB Rajendra Prasad) గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు
-