మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక తీర్పు వెల్లడించింది. అంతేకాదు ఈ ఏడాది మే 5లోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేసుకోవచ్చని సీబీఐకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తెలిపింది. వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు.
అయితే తొలుత ఈ హత్యకేసు(Viveka Murder Case)ను సిట్ దర్యాప్తు చేసిన తరుణంలో సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్ర గంగిరెడ్డి(Yerra gangi Reddy ) బెయిల్‌పై బయట ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన సీబీఐ ఆయన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరడంతో తాజాగా బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు తీర్పు సీబీఐకు ఊరట లభించింది.
Read Also: శ్వేత మృతి కేసులో సెన్సేషనల్ ట్విస్ట్.. వెలుగులోకి సూసైడ్ లెటర్!
Follow us on: Google News, Koo, Twitter