మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అధ్యక్షతన పార్టీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేస్తున్నారు. 22 ఏండ్ల కింద పురుడుపోసుకున్న టీఆర్‌ఎస్‌ గత సంవత్సరం విజయదశమినాడు బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

14 ఏండ్ల సుదీర్ఘ స్వరాష్ట్ర పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్(CM KCR) అన్నారు. బీఆర్‌ఎస్‌(BRS)గా రూపాంతరం చెందిన తరువాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీకి వస్తున్న ఆదరణ, అనంతర కార్యాచరణ వంటి అంశాలను శ్రేణులకు వివరించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు బీఆర్‌ఎస్‌పై కావాలని బురదజల్లే కుట్రలు ఎలా చేస్తున్నారు? వాటిని ఎలా తిప్పికొట్టాలి? క్షేత్రస్థాయిలో ప్రజలతో పార్టీ శ్రేణులు ఎలా మసలుకోవాలి? వంటి అంశాలపై అధినేత, సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేయనున్నారు. అంతేగాక, ఎన్నికలు సమీపిస్తున్నా హైదరాబాద్‌లోనే ఉంటున్న లీడర్లను హెచ్చరించారు. వెంటనే నియోజకవర్గాలకు వెళ్లాలని సూచించారు. జనాల్లో ఆదరణ ఉన్న లీడర్లకే టికెట్లు కేటాయిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

Read Also: ఆ పిచ్చితోనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...