ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో అమెరికా(America) వెళ్లిన ఓ తెలుగు యువకుడు దురదృష్టవశాత్తూ తుపాకీ తూటాలకు బలైయ్యాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సాయిశ్ వీర(24) రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్లాడు. చదువుకుంటూనే గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే దొంగతనానికి వచ్చిన ఇద్దరు దుండగులను పట్టుకునే క్రమంలో సాయిపై కాల్పులు జరగ్గా ఆసుప్రతితో చికిత్స పొందుతూ మరణించాడు. స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా దూరంకావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని మృతుడి స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -
Read Also: చంద్రబాబు కృషి వల్లే ఆ ఫలితాలు చేతికందుతున్నాయి
Follow us on: Google News, Koo, Twitter