తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు(Anna Rambabu) అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన తనకు కనీస మర్యాదలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీటీడీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని విమర్శించారు. టీటీడీ అధికారుల తీరు వల్ల ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీసు అంటే ఈవోకు లెక్కలేకుండా పోతుందని ఆరోపించారు. శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఈవో ధర్మారెడ్డి ఇవ్వడం లేదన్నారు. ధర్నారెడ్డి ఈవోగా కొనసాగాలని ఎలా తపన పడుతున్నారో.. అదే విధంగా తమకు కూడా స్వామి వారిని దర్శించుకోవాలన్న కోరిక ఉంటుందన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan)కి ఫిర్యాదు చేస్తానని రాంబాబు(Anna Rambabu) చెప్పారు.
Read Also: బీఆర్ఎస్‌తో సీపీఎం పొత్తుపై తమ్మినేని వీరభద్రం క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter