Tirupati Man Harrassed: ఇన్‌స్టా పరిచయం.. న్యూడ్‌ వీడియో కాల్స్‌.. ఆపై వేధింపులు!

-

Tirupati Man Harrassed Vizag Woman with her Nude video call recordings: ఇన్‌స్టాలో వచ్చిన రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయటమే ఆమె చేసిన పెద్ద పొరపాటు. అతడి మాటలకు మైమరిచిపోయింది. తను వివాహిత అన్న విషయమే మరిచిపోయి.. పూర్తిగా ఆ మోసగాడి వసమయిపోయింది. అతడి మాయలో పడి క్రమంగా మానసికంగా, ఆర్థికంగా నష్టపోయింది. అతడగాడి మోసపు మాటలను ప్రేమ అనుకుంది.. కానీ అతడు మాత్రం ఆమెను ఓ డబ్బు వచ్చే వనరుగా చూశాడు. బెదిరింపులకు గురి చేస్తూ, భారీగా డబ్బులు గుంజాడు. అతడి వేధింపులు మరింత శృతిమించటంతో గత్యంతరం లేక బాధిత వివాహిత పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

ఈ ఘటన విశాఖలో జరిగింది. విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుపతికి చెందిన గూడూరుకు చెందిన శేఖర్‌ (24) అనే యువకుడు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. దాన్ని ఆ మహిళ యాక్సెప్ట్‌ చేసింది.. అలా ఇద్దరి మధ్యా ఛాటింగ్‌ మెుదలయ్యింది.. అలా ఇద్దరూ ఫోన్‌ నెంబర్లు మార్చుకున్నారు. అతడు చెప్పే మాటలు అన్నీ నిజమే అని నమ్మి.. అతడు నిజంగా ప్రేమిస్తున్నాడని అనుకొని, వివాహిత అన్న విషయాన్ని సైతం మరిచిపోయింది. దీంతో అతడికి తన న్యూడ్‌ ఫోటోలను పంపించటం, నగ్నంగా వీడియో కాల్స్‌ చేసుకోవటం జరిగింది. అంతేగాకుండా వారిద్దరూ మాట్లాడుకున్న వాయిస్‌ రికార్డ్స్‌ను సైతం అతడు భద్రపరిచాడు. వాటినే ఆయుధంగా మార్చుకొని, అడిగినంత డబ్బులు పంపించకపోతే.. (Tirupati Man Harrassed Vizag Woman) సోషల్‌ మీడియాలో న్యూడ్‌ కాల్స్‌, ఫోటోస్‌ పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో మెుదట భయపడి చాలా సార్లు డబ్బులు పంపించిందా మహిళ. శేఖర్‌ వేధింపులు మరింత ఎక్కువ కావటంతో సదరు మహిళ విశాఖ సైబర్‌ క్రైం పోలీసలకు ఫిర్యాదు చేసింది. సాంకేతిక సాయంతో శేఖర్‌ను పట్టుకొని, విశాఖకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...