Tirumala |కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)శుభవార్త అందించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, అర్జిత సేవలతో పాటు ఇతర సేవల టికెట్లకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. గతంలో ఆయా సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందే ప్రకటించేది. తాజాగా అన్ని రకాల సేవా టికెట్లకు సంబధించిన తేదీలతో క్యాలెండర్ విడుదల చేసింది. టికెట్లకు సంబంధించిన వివరాలు ఇలా….
APRIL 20:
*ఉదయం 10గంటలకు జులై మాసానికి సంబంధించిన లక్కీ డిప్ ద్వారా కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల
*ఉదయం 11.30గంటలకు జులై మాసానికి సంబంధించిన ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల విడుదల
APRIL 21:
*ఉదయం 10 గంటలకు జులై నెల అంగప్రదక్షిణం టికెట్ల విడుదల
*మధ్యాహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్ల జారీ
APRIL 24:
*ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లు కలిగిన శ్రీవారి భక్తులకు దర్శన టికెట్ల విడుదల
*మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టోకెన్ల విడుదల
APRIL 25:
*ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
APRIL 26:
*ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించి తిరుమల(Tirumala)లోని వసతి గదుల కోటా విడుదల
APRIL 27:
*ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించి తిరుపతిలోని వసతి గదుల కోటా విడుదల
ఈ మేరకు టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Read Also: రామప్ప ఆలయంలో ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
Follow us on: Google News, Koo, Twitter