ఐదేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి(Kodikatti Case) సంచలన రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. ఈ విచారణకు నిందితుడు కోడికత్తి శ్రీను, అతడి తరపు న్యాయవాది, ప్రస్తుత సీఎం జగన్(CM Jagan) తరపు న్యాయవాది హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కి నిందితుడు శ్రీనివాస్ లేఖ రాశాడు. దాదాపు‘1610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉంటున్నాను. ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదు. విముక్తి కలిగించండని కోరాడు. నాపై నమోదు అయిన కేసును జిల్లాకోర్టు సత్వరమే విచారించి న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశాడు.
Kodikatti Case | న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో మీకు లేఖ రాస్తున్న అని తెలిపాడు. గతంలోనూ అతని తల్లి సావిత్రి అప్పుడు సీజేఐగా ఉన్న ఎన్వీ రమణకు(NV Ramana) ఇదే విషయంపై లేఖ రాశారని న్యాయవాది అబ్దుల్ సమీద్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టుకు పది కిలో మీటర్ల దూరంలో నివాసం ఉంటున్నారని అయినా కానీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పరని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటీషన్లు వేయించి విచారణను జాప్యం చేస్తున్నారన్నారు. ఇకనైనా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు.