ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీనే నెంబర్ వన్: ప్రత్తిపాటి

-

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచి కప్పు కొడుతుందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జూదం అనేది లేదని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని కానీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయని ఆరోపించారు. చిలకలూరిపేట(Chilakaluripet) నియోజకవర్గంలోని అపార్టుమెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోందని.. మంత్రి విడదల రజని(Vidadala Rajini) సహకారంతోనే యథేచ్ఛగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ క్లబ్‌ల ద్వారా రజిని రూ.కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. సీఎం నివాసానికి సమీపంలో ఉన్న చిలకలూరిపేటలో జరిగే అరాచకం జగన్ కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పేకాటతో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని పుల్లారావు(Prathipati Pulla Rao) ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:
1. కోడికత్తి కేసులో మరో ట్విస్ట్.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...