నంద్యాలలో(Nandyala) హిజ్రాలు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ భయానక వాతావరణంగా మార్చారు. బిక్షాటన విషయంలో హిజ్రాల(Transgenders) వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్ళింది. నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ముందే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం చేశారు.
బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు(Nandyala) చెందిన హిజ్రాల వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. నంద్యాలలో బిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తుండగా, నంద్యాల వర్గం అడ్డుకుంటోంది. ఈ క్రమంలో రూరల్ పీఎస్ ముందు ఎదురుపడ్డ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకొని రాళ్లు రువ్వుకుని బీభత్సం సృష్టించారు. దీంతో టూ టౌన్ రూరల్ పోలీసులు వంద మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి.
Read Also: తెలంగాణలో పరువుహత్య కలకలం