Vangalapudi Anitha: జగన్ భజన పై ఉన్న ఆసక్తి.. తన బాధ్యతలపై లేదు

-

Vangalapudi Anitha: వాసిరెడ్డి పద్మకు ఇప్పటికీ జగన్ భజన పై ఉన్న ఆసక్తి, మహిళా చైర్మన్‌‌గా తన బాధ్యతలపై లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. సీబీఎన్, పవన్ కళ్యాణ్‌‌కి నోటీసులు ఇవ్వాలన్న ఆతృత, రాష్ట్రంలో స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించడానికి, చర్యలు తీసుకోవడానికి లేదని ఆరోపించారు. ‘‘గత మూడేళ్లలో మహిళలపై, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల వివరాలతో స్వయంగా మేమే వెళ్ళి ఒక పుస్తకం ఇచ్చాం.. అందులో 1500 వరకూ ఘటనలు ఉన్నా, ఈవిడ ఆ ఫిర్యాదు ఆధారంగా ఒక్కరికి కూడా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. అంతెందుకు.. నిన్న ఈరోజే పలు ఘటనలు జరిగాయి.. పవన్ కళ్యాణ్‌‌కి నోటీసులు ఇవ్వడానికి హడావిడిగా స్పందించిన ఈవిడ, గన్నవరంలో యువతిపై గంజాయి బ్యాచ్ సామూహిక అత్యాచార యత్నం ఘటనలో గానీ, జంగాలపల్లె విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో గానీ ఈవిడ స్పందించిందా? స్పందించదు.. భారతి రెడ్డి విషయంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ పై రాత్రి పూట డీజీపీ ఆఫీస్‌‌‌కు పరుగెత్తి ఫిర్యాదు చేసిన ఈవిడ.. పైన జరిగిన ఘోరమైన ఘటనలపై కనీసం మాట్లాడిందా? జగన్ రెడ్డి కోసం అయితే మాత్రం అర్ధరాత్రి అయినా స్పందిస్తుంది. ఎవరికైనా నోటీసులు ఇస్తుంది.’’ అని Vangalapudi Anitha ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -

Read also: తంగలాన్‌తో వస్తున్న విక్రమ్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...