టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.’టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’అని ట్వీట్ చేశారు.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023
అలాగే ఆ పార్టీ నేత, సినిమా నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ‘సమాజానికి సేవ చేసే ప్రతి నాయకుడు కలకాలం వర్ధిల్లాలి. తెలుగు జాతికి మంచి పనులు చేయడానికి మరింత శక్తిని, ఉత్సాహన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ’ అంటూ పీవీపీ ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు వారికి ధన్యవాదాలు చెబుతున్నారు.
సమాజానికి సేవ చేసే ప్రతి నాయకుడు కలకాలం వర్ధిల్లాలి!
తెలుగు జాతికి మంచి పనులు చేయడానికి మరింత శక్తిని, ఉత్సాహన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..@ncbn#HappyBirthdayCBN— PVP (@PrasadVPotluri) April 20, 2023
కాగా కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విజయసాయి రెడ్డి నేడు చంద్రబాబు(Chandrababu)కు బర్త్ డే విషెస్ చెప్పడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: యువతి ప్రేమ పంచాయితీ.. మేనమామ దారుణ హత్య
Follow us on: Google News, Koo, Twitter