విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) మరో సంచలన ప్రకటన చేశారు. టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
‘అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోకసభ స్పీకర్‌ను కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకుని, ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
కాగా శుక్రవారం విజయవాడ ఎంపీగా పార్టీ అధినేత చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పి బాంబ్ పేల్చిన నాని(Kesineni Nani).. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం విజయవాడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024