Visakha Steel Plant Employees protest on issues attend duties with black badges: విశాఖ ఉక్కు కార్మికుల నిరహార దీక్షలు 635 రోజులకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు కార్మిక నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ప్రధాని విశాక పర్యటనకు షెడ్యూల్ విడుదల చేయడంతో, మోడీ పర్యటనతో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని ఉక్కు కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలంటూ స్టీల్‌ప్లాంట్ కార్మికులు నిరహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే..
- Advertisement -