Vijayasai Reddy – Chandrababu | స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్క్‌లో తన విజన్-2047 పత్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. “భారతదేశం ప్రపంచాన్ని నడిపించగలదని, ఐదు వ్యూహాలు ఉంటే ప్రపంచ అభివృద్ధిలో తెలుగువారు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. వ్యూహాల గురించి వివరిస్తూ, మొదటి వ్యూహం శక్తి అని అన్నారు. 90వ దశకం చివరిలో ప్రారంభించిన విద్యుత్ రంగ సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని చేసుకున్నారు.
తాజాగా.. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ‘‘విజన్ 2047 అనేది చంద్రబాబు గారి సొంత బ్రాండింగ్ ఏమీ కాదు. ఏడాది క్రితమే నీతి ఆయోగ్(NITI Aayog) ‘వికసిత భారత్-2047’ ప్రణాళికను విడుదల చేసింది. 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అందులో పేర్కొంది. దానినే బాబు గారు కాపీ కొట్టి దేశానికి, రాష్ట్రానికి తాను దిశా నిర్దేశం చేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారు.’’ అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.