గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలేదన్న కోపంతో తమను మాజీ మంత్రి బాలినేని(Balineni Srinivasa Reddy) ఎంతో బాధిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన అనేక మంది వాపోతున్నారు. ఓటు వేయలేదన్న కక్ష్యతోనే ఆయన తమకు చెందాల్సిన భూమిని.. ఇంకొల్లు మండలం భీమవరం గ్రామస్థులకు డీకే పట్టాలు ఇప్పించారని, దాని వల్ల దాదాపు 427 కుటుంబాలను రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయనందుకు ఇలా ఎవరైనా ఇబ్బంది పెడతారా అంటూ మాజీ మంత్రి బాలినేనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మంగళగిరిలో నిర్వహించిన వినతులు స్వీకరణ కార్యక్రమంలో వారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy)కి వినతి పత్రం అందించారు. దీనిని స్వీకరించిన వారు పరిష్కారం కోసం శ్రమిస్తామని హామీ ఇచ్చారు.
‘‘ప్రజల వినతులు స్వీకరించారు. వారి సమస్యల ప్రాధాన్యత ఆధారంగా పరిష్కారాలను సాధించే దిశగా చర్యలు చేపడతాం. వినతులపై ఇప్పటికే సంబంధిత అధికారులతో ఫోన్‌లో చర్చించాం. పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నాం. ప్రజల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం. ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు’’ అని హామీ ఇచ్చారాయన(Anam Ramanarayana Reddy).