Kandru Kamala |జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

-

Kandru Kamala |జనసేనాని ఎంట్రీతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ప్రధాన పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సెలైంట్‌గా ఉన్న నేతలంతా ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఆచితూచి అడుగులు వేస్తు్న్నారు. ఈ క్రమంలో వైసీపీలో టికెట్ రాదని భావించిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల(Kandru Kamala) కూడా జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు ఆజ్యం పోసేలా ఆమె ఇవాళ జనసేన పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలను పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. దీంతో అతి త్వరలోనే ఆమె జనసేనలో చేరబోతున్నారనే వార్తలు మరింత విస్తృతమయ్యాయి. దీనిపై కమల అధికారికంగా స్పందించాల్సి ఉంది.

- Advertisement -
Read Also: వాటిని తగ్గిస్తే.. గుండెపోటు రాకుండా జాగ్రత్త పడినట్లే!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...