Kethireddy |టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు అంటూ లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహిస్తారని, నిజాయతీగా ఉండాలంటూ ఉద్యోగులకు నీతులు చెబుతుంటారని కానీ చేసే పనులు అలా ఉండవంటూ విమర్శించారు. తాజాగా.. లోకేష్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి(Kethireddy) స్పందించారు. ఆరోపణలు చేసే ముందు లోకేష్ ఆధారాలు చూపించాలన్నారు. తన భూ దందాలు, అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. లేదంటే లోకేష్ పాదయాత్రకు ప్యాకప్ చేసి, రాజకీయాలకు నుంచి వైదొలగలాని సవాల్ విసిరారు.
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లోకేష్‌కు కేతిరెడ్డి సవాల్
-