చెప్పేవి నీతులు, దోచేవి గుట్టలు.. కేతిరెడ్డి ‘గుడ్‌మార్నింగ్’ ప్రోగ్రాంపై లోకేష్ సెటైర్లు

-

Nara Lokesh |ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేతిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ‘‘చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్.’’ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -
Read Also: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...