తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. వివిధ వేషాల్లో పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి(MP Gurumurthy) పుష్ప-2లో అల్లు అర్జున్ వేసిన మాతంగి వేషధారణ వేసి గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు. దీంతో ఎంపీ(MP Gurumurthy)తో ఫొటోలు దిగడానికి భక్తులు పోటీపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో గంగమ్మ జాతర కన్నులపండువగా కొనసాగుతోంది. అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది.
వందలాది మంది భక్తులు విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. మొత్తం 8రోజుల పాటు నిర్వహించే జాతరలో ఐదో రోజు మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తాగే తిరుపతిలో గంగమ్మ జాతర ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ జాతరకు తిరుపతి నుంచే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే గంగమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
Read Also: చొక్కాపై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ క్రికెటర్ గవాస్కర్
Follow us on: Google News, Koo, Twitter