చొక్కాపై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న దిగ్గజ క్రికెటర్ గవాస్కర్

-

Sunil Gavaskar |ఆదివారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై(Chennai)-కేకేఆర్(KKR) మ్యాచులో ఆతిథ్య జట్టు సీఎస్కే ఓటపాలైన సంగతి తెలిసిందే. అయితేనేం ధోని సేన అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఈ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో సొంతమైదానం వేదికగా చెన్నై జట్టుకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం తన జట్టు సభ్యులతో కలిసి ధోనీ(Dhoni) అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ కలియతిరిగారు. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ సీఎస్కే(CSK) జెండాలతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు.

- Advertisement -

ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌(Sunil Gavaskar) చొక్కా మీద ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం సన్నీ మాట్లాడుతూ తర్వాత మ్యాచ్ ల కోసం తనకు మరో కొత్త పింక్ చొక్కా కావాలని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియామకం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...