ycp rebel mp Raghurama:అమరావతి రైతులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ కూడా ఓ వ్యవస్థేనా అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది మందితో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు విధించని ఆంక్షలు, అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు విధిస్తున్నారని నిలదీశారు. 29వేల మంది రైతు కుటుంబాల రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను రాజధానిగా ఎవరు అడ్డుకోలేరన్న మంత్రుల వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిద్దాం. న్యాయాన్ని సాధించుకుందాం అంటూ రఘురామ పిలుపునిచ్చారు.
ప్రభుత్వాన్ని హైకోర్టు ఎన్నోసార్లు చీవాట్లు పెట్టింది. ఇప్పుడు సీఐడీ పోలీసులకు సైతం చీవాట్లు పెడుతోంది. కాని వారికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు కూడా లేదు అంటూ దుయ్యబట్టారు. మాకంటే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని రాక్షసులే అసూయపడేటువంటి రాక్షుసుల వంటి మనుషుల మధ్య మనం ఉన్నామని రఘురామ(mp Raghurama)వ్యాఖ్యానించారు. రాక్షసుల కంటే ఎక్కువుగా ఎలా హింసించవచ్చో రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను శాసిస్తున్న కొంతమంది అధికారులను చూస్తే అర్థం అవుతుందని రఘురామ దుయ్యబట్టారు.
Read also: ఆరోగ్యశ్రీలో 3,255కి వైద్య చికిత్సల పెంపు