YS Jagan Mohan Reddy: ఆరోగ్యశ్రీలో 3,255కి వైద్య చికిత్సల పెంపు

-

YS Jagan Mohan Reddy: ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీతో అందించనున్నట్టు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకు వచ్చాము. భారీ సంఖ్యలో మునుపెన్నడూలేని విధంగా సుమారు 46వేల పోస్టులను భర్తీచేశాం. ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన సేవలు అందాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్యవంతమైన సమాజంతో మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి వాటిని భర్తీచేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించాం. సౌకర్యాలు, వసతులు, సరిపడా సిబ్బందిని ప్రభుత్వం నుంచి ఇవ్వగలిగాం. ఆస్పత్రుల్లో ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరును తప్పనిసరి చేయాలి’’ అని (YS Jagan Mohan Reddy) అధికారులకు సూచించారు.

- Advertisement -

అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. అక్టోబరు 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ట్రయల్‌ రన్‌ ప్రారంభించామని.. ప్రతి పీహె చ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటున్నారని తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బంది ఉంటారని సీఎంకు వివరించారు. ప్రత్యేక యాప్‌ ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలువుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 67 రకాల మందులుతో విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, 14 రకాల ర్యాపిడ్‌ కిట్లను కూడా విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read also: ఫాంహౌస్ ఘటనలో ఎమ్మెల్యేల ఆడియో లీక్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...