కొత్త ఇంఛార్జ్‌లతో కూడిని రెండో జాబితాను వైసీపీ(YCP) విడుదల చేసింది. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. తొలి విడతలో 11 మంది కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించగా.. తాజాగా 27మందికి చోటు కల్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 38 మందిని ఇంఛార్జ్‌లుగా అధిష్టానం నియమించింది.
YCP రెండో జాబితా పేర్లు ఇవే..
తిరుపతి – భూమన అభినయ రెడ్డి
రాజాం (ఎస్సీ) – డాక్టర్ తాలె రాజేష్
అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) – కంబాల జోగులు
రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్
పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం – వంగ గీత
జగ్గంపేట – తోట నరసింహం
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ
పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి – బీఎస్ మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) – తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ – కేవీ ఉషశ్రీ చరణ్
కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్
అనంతపురం ఎంపీ – మాలగుండ్ల శంకరనారాయణ
హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
రెండో జాబితాలో మొత్తం 8మంది సిట్టింగ్‌లు టికెట్ కోల్పోయారు. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ , పి.గవన్నరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పూర్తిగా వాళ్ల స్థానాలను కోల్పోయారు. ఇక హిందూపూరం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కూడా తన స్థానాన్ని కోల్పోయారు. గోరంట్ల మాధవ్ స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.