పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకొని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విశాఖపట్నంలో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయనీ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎల్లో అలెర్ట్ నేపథ్యంలో నాలుగు రోజులు పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. చేపల వేట నాలుగు రోజుల పాటు నిషేధిస్తున్నామనీ సముద్రంలోకి మత్స్యకారులు ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యవసరం అయితే తప్పా, వర్షంతో బయటకు వెళ్లకూడదని ప్రజలకు అధికారులు సూచించారు.