శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.200కోసం కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్‌కుమార్ ఈనెల 3న విశాఖ నుంచి తన స్నేహితులతో కలిసి కారులో శ్రీకాకుళం వచ్చాడు. ఏదో అర్జెంట్ పని ఉంది ఇంటికి వెళ్లాలని స్నేహితులకు చెప్పగా.. వారు తెల్లవారుజామున భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఎక్కించారు. అయితే కొద్దిదూరం వెళ్లాక బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ రామకృష్ణ ఛార్జీ డబ్బులు రూ.200 ఇమ్మని అడిగారు.
Srikakulam |తన స్నేహితులు ఫోన్‌పే చేస్తారని చెప్పాడు. ఎంతసేపటికి డబ్బులు రాకపోడంతో మళ్లీ భరత్‌ను నిలదీశారు. తన స్నేహితుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని.. విశాఖ వెళ్లిన తర్వాత ఇస్తానని చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. వాగ్వాదం జరగడంతో బుడుమూరు సమీపంలోకి రాగానే భరత్‌ను రన్నింగ్ బస్సులో నుంచి బయటకు తోసేశారు. దీంతో డివైడర్ మధ్యలో ఉన్న క్రాస్‌బేరియర్‌ను ఢీకొని తలకు బలమైన గాయమైంది. తీవ్ర గాయాలతో ఉన్న భరత్‌ను హైవే పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. సీసీ టీవీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లీనర్, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: ఇంటిపై కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు మహిళలు మృతి
Follow us on: Google News, Koo, Twitter