తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

-

వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వరుస అరెస్టుల నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టులో సీజే బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు అనుమతించిన న్యాయస్థానం వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలను తమ ముందు ఉంచాలని అవినాశ్(YS Avinash Reddy) తరపు లాయర్ కు ఆదేశాలు జారీచేసింది. దీంతో మధ్యాహ్నం 2.30గంటలకు ఈ పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే మూడు గంటలకు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: యూపీలో వరుస ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...