మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. నేడు మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)కి నోటీసులు జారీ చేసింది. దీంతో పులివెందులలో ఉన్న ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. ఇటీవలే నాలుగు సార్లు అవినాశ్ ని విచారించిన అధికారులు.. ఐదోసారి విచారణకు పిలవడం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కల్గిస్తోంది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం.. అవినాశ్ ని విచారణకు పిలవడంతో ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డిని 10రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. కాగా ఆదివారం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో సీబీఐ న్యాయమూర్తి ఆయనకు 14రోజుల రిమాండ్ విధించారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. కాసేపట్లో అవినాశ్ రెడ్డి విచారణ
-