వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case)లో అరెస్టు చేసిన భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు ఆదివారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు చేస్తుండగా ఒక్కసారిగా భాస్కర్‌రెడ్డి బీపీ లెవెల్స్పెరిగిపోయాయి. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స చేసి బ్లడ్‌ప్రెషర్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు జరిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy) వైద్యులతో అన్నట్టు సమాచారం. పరీక్షల అనంతరం సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని శాంతినగర్ జడ్జెస్ క్వార్టర్స్‌లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి నివాసంలో ఆయన ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి భాస్కర్‌రెడ్డికి పది రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు అతన్ని చెంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. కాగా, భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి తన క్లయింట్‌కు బెయిల్మంజూరు చేయాలంటూ పిటీషన్‌దాఖలు చేశారు.
Read Also: పెళ్లిమీద నమ్మకం లేదు.. డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతా: శృతి హాసన్
Follow us on: Google News, Koo, Twitter